చంద్రబాబు నాయుడు కి సిల్వర్ జూబ్లీ విషెస్ తెలిపిన విజయసాయి రెడ్డి

Tuesday, September 1st, 2020, 07:10:26 PM IST

తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి, ప్రతి పక్ష నేత చంద్రబాబు నాయుడు పై వైసీపీ నేత, ఎంపీ విజయసాయి రెడ్డి మరొకసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. బాబు, వెన్నుపోటు తో అధికారం లాక్కొని, ప్రజల సమ్మతం లేని పీఠం లో కూర్చొని, వ్యవస్థల్ని భ్రష్టు పట్టించి, ఇంకొన్ని వ్యవస్థల్ని మ్యానేజ్ చేస్తూ, డర్తీయస్ట్ పొలిటీషియన్ గా, చివరికి రాష్ట్ర ప్రజల చిత్కారానకి గురి అయి, వేరే రాష్ట్రం లో విశ్రాంత జీవితం గడుపుతున్న మీకు, సిల్వర్ జూబ్లీ విషెస్ అంటూ ఎంపీ విజయసాయి రెడ్డి వ్యాఖ్యానించారు.

నెటిజన్లు సైతం విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలకు స్పందిస్తున్నారు. ఒక పక్క చంద్రబాబు నాయుడు పై విమర్శలు చేస్తూనే, మరి కొందరు విజయసాయి రెడ్డి పై, రాష్ట్ర ప్రభుత్వం పై ఘాటు విమర్శలు చేస్తున్నారు. కొందరు మాత్రం అభివృద్ది చేయడం రాక, ఇలా ప్రతి పక్ష పార్టీ పై విమర్శలు చేస్తున్నారు, ఇంకా ఎన్ని రోజులు ఇలా చేస్తారు అంటూ వరుస ప్రశ్నలు వేస్తున్నారు.