చంద్రబాబు తన డ్రామాబాజీ ను ఆపాలని ఆశిస్తున్నాను – విజయ సాయి రెడ్డి

Friday, August 21st, 2020, 03:00:53 AM IST

Ycp-mp-vijayasai-reddy
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో ఉన్న ప్రతి సమస్య పై టీడీపీ తన అభిప్రాయాలను వెళ్లగక్కుతూ, అధికార పార్టీ పై విమర్శలు చేస్తూనే ఉన్నారు. రాజదాని అంశం, కరోనా అంశం, వరదల అంశం, ఫోన్ ట్యాపింగ్ అంటూ మరొక వ్యవహారం పై అధికార పార్టీ కి వరుస ప్రశ్నలు వేస్తూనే ఉన్నారు. అయితే తాజాగా రాజధాని అంశం పై కేంద్ర ప్రభుత్వం తమకు పాత్ర లేదు అని స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.

అయితే ఇదే విషయాన్ని వైసీపీ నేత, ఎంపీ విజయసాయి రెడ్డి మరొకసారి సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజధాని విషయం లో రాష్ట్ర ప్రభుత్వం కి నిర్ణయం తీసుకోవచ్చు అని, అందుకు కేంద్రానికి స్థానం లేదు అని అఫిడవిట్ దాఖలు చేసిన విషయాన్ని విజయసాయి రెడ్డి తెలిపారు. అయితే చంద్రబాబు నాయుడు ఇప్పటికైనా తన డ్రామా బాజి ఆపాలని కోరుకుంటున్నా అని అన్నారు. అంతేకాక తన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం పట్ల ప్రజలు కూడా గమనిస్తూనే ఉన్నారు అన్న విషయాన్ని తెలిపారు.