ఇంకా ఇలాంటి చిత్ర విచిత్రాలు… విడ్డూరాలు ఎన్ని చూడాలో మరి – వైసీపీ ఎంపీ

Wednesday, August 19th, 2020, 03:00:24 AM IST


తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు, ప్రతి పక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రవర్తిస్తున్న తీరు పట్ల వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ అంటూ చంద్రబాబు నాయుడు చేస్తున్న ఆరోపణలతో వైసీపీ నేతలు మరొకసారి ఘాటు విమర్శలు చేస్తున్నారు. ఈ నేపధ్యంలో వైసీపీ నేత, ఎంపీ విజయసాయి రెడ్డి చంద్రబాబు నాయుడు పై సంచలన వ్యాఖ్యలు చేశారు.

బాబు నాయుడు అంటూ సంబోధిస్తూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధానిని, ఆయన కుటుంబాన్ని తిట్టిన నోటితోనే ఆయన నాయకత్వాన్ని పొగిడారు చంద్రబాబు అంటూ సెటైర్స్ వేశారు.సీబీఐ, ఈ డి, ఐటీ, ఎన్ ఐ ఏ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో కి రావడానికి వీలు లేదు అన్న నోటితోనే కేంద్ర ప్రభుత్వం విచారణ కావాలని చంద్రబాబు అంటున్నారు. ఇంకా ఇలాంటి చిత్ర విచిత్రాలు, విడ్డూరాలు ఎన్ని చూడాలో మరి అంటూ విజయ సాయి రెడ్డి వ్యాఖ్యానించారు. ప్రధాని నరేంద్ర మోడీ కి చంద్రబాబు లేఖ రాయడం పట్ల వైసీపీ నేతలు ఇప్పటికే తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.