అమరావతి కోసం రోడ్డెక్కండి అంటూ హైదరాబాద్ లో ఉండి చెబుతున్నాడు జూమ్ బాబు

Tuesday, August 18th, 2020, 01:20:51 AM IST

Ycp-mp-vijayasai-reddy2
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజధాని విషయం కి టీడీపీ నేతలు ఇంకా పోరు కొనసాగిస్తూనే ఉన్నారు. అమరావతీ రాజధాని గా కొనసాగేందుకు ఆ ప్రాంత ప్రజలు, రైతులు కొన్ని నెలల నుండి పోరాటం చేస్తూనే ఉన్నారు. అయితే మొదటి నుండి ప్రభుత్వం తీసుకున్న మూడు నిర్ణయాలను వ్యతిరేకిస్తున్న చంద్రబాబు నాయుడు తీరు పై వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు తీరు పై మరొకసారి వైసీపీ నేత, ఎంపీ విజయసాయి రెడ్డి ఘాటు విమర్శలు చేశారు.

అమరావతి కోసం రోడ్డెక్కండి అంటూ హైదరాబాద్ ఇంటిపట్టున ఉండి చెప్తున్నాడు జూమ్ బాబు అంటూ చంద్రబాబు నాయుడు పై విజయ సాయి రెడ్డి ఘాటు విమర్శలు చేశారు. కరోనా కి భయపడి తన ఇంటికి పార్టీ సీనియర్ నాయకులను కూడా రానివ్వడం లేదు అని ఎద్దేవా చేశారు. నాయకుడంటే ముందుండి. నాయకుడంటే ముందుండి నడపాలి బాబు, ఇంట్లో కూర్చొని జూమ్ ద్వారా కాదు అంటూ వరుస విమర్శలు చేశారు. చంద్రబాబు నాయుడు తీరు పై ఇప్పటికే వైసీపీ నేతలు వరుస గా విమర్శలు చేస్తున్నారు. అయితే విజయ సాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలపై నెటిజన్లు స్పందిస్తున్నారు.

విజయసాయి రెడ్డి కి కరోనా వైరస్ పాజిటివ్ వచ్చినపుడు హైదరాబాద్ వచ్చి ట్రీట్మెంట్ తీసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. కరోనా సోకినప్పుడు సొంత రాష్ట్రం లో వైద్యం తీసుకోకుండా, ఇతర రాష్ట్రం అయిన హైదరాబాద్ లో తీసుకోవడం పట్ల నెటిజన్లు ఘాటు విమర్శలు చేస్తున్నారు.