బాబూ…మీ 14 ఏళ్ల పాలనలో ఆ లెక్కలు విడుదల చేసే ధైర్యం ఉందా?

Saturday, August 15th, 2020, 03:00:56 AM IST

Ycp-mp-vijayasai-reddy
2019 ఎన్నికల ముందు వరుస హామీలు ఇచ్చారు జగన్ మోహన్ రెడ్డి. అదే 2019 ఎన్నికల్లో భారీ విజయం సాధించడం మాత్రమే కాకుండా, ఇచ్చిన హామీలను చాలా వేగంగా పూర్తి చేస్తున్నారు. దాదాపు 90 శాతం హామీలు కేవలం గడిచిన 14 నెలల్లోనే పూర్తి చేయడం గమనార్హం. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు వైసీపీ నేత, ఎంపీ విజయసాయి రెడ్డి సోషల్ మీడియా లో ఒక పోస్ట్ ద్వారా వివరించే ప్రయత్నం చేశారు. అంతేకాక ప్రతి పక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కి సూటి ప్రశ్న విసిరారు.

కేవలం 14 నెలల కాలం లో పేదల సంక్షేమం మీద జగన్ గారి ప్రభుత్వం చేసిన వ్యయం అక్షరాలా రూ.59,425 కోట్ల రూపాయలు అని అన్నారు. అయితే 73 ఏళ్ల స్వతంత్ర భారత చరిత్రలో ఇదొక రికార్డ్ అని వ్యాఖ్యానించారు. బాబూ, మీ 14 ఏళ్ల పాలనలో ఇదే తరహాలో ఏం చేశారో అధికారికంగా లెక్కలు విడుదల చేసే ధైర్యం ఉందా అంటూ సూటిగా ప్రశ్నించారు. అయితే విజయ సాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలపై నెటిజన్లు స్పందిస్తున్నారు. ఎంపీ విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలకి కొందరు మద్దతు తెలుపుతున్నారు, మరికొంత మంది మాత్రం, రాష్ట్ర ప్రభుత్వ వైఖరి ను ఎండగడుతూ వరుస విమర్శలు చేస్తున్నారు.