చంద్రబాబు పై సంచలన వ్యాఖ్యలు చేసిన వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి

Monday, August 10th, 2020, 11:40:30 PM IST


ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పాలన విధానం ను ప్రశ్నిస్తూ, ప్రతి పక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పలు వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ సందర్భంగా టీడీపీ పాలనలో చేసిన అభివృద్ది పనులను చంద్రబాబు నాయుడు తెలిపారు. 13 జిల్లాల అభివృద్ది పనులను సైతం వివరించారు. అయితే చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలకు గానూ వైసీపీ నేత, ఎంపీ విజయసాయి రెడ్డి స్పందించారు. చంద్రబాబు నాయుడు వైఖరి ను ప్రశ్నిస్తూ పలు ఘాటు విమర్శలు చేశారు.

బట్టలు విడిచిన మూర్ఖపు రాజు, తాను వేసుకున్న దేవతా వస్త్రాలు మూర్ఖులకు కనిపించడం లేదు అనుకున్నాడట. 175 కి 151 ఓడిన, కొడుకును కూడా ఓడగొట్టుకున్న చంద్రబాబు 13 జిల్లాలను తాను అభివృద్ది చేశానని ఏవేవో గ్రాఫిక్స్ ఇపుడు చూపిస్తున్నాడట అంటూ చంద్రబాబు పై విజయ సాయి రెడ్డి వరుస విమర్శలు చేశారు. షేమ్ షేమ్ బాబూ అంటూ చంద్రబాబు తీరును ఎండగడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే విజయ సాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలకు నెటిజన్లు స్పందిస్తున్నారు. వైసీపీ అభిమానులు ఎంపీ చేసిన వ్యాఖ్యలను సమర్దిస్తుండగా, టీడీపీ అభిమానులు ఘాటు విమర్శలు చేస్తున్నారు.