బిగ్ న్యూస్: చంద్రబాబు డెడ్ లైన్ ఇస్తే అలాగే ఉంది – వైసీపీ ఎంపీ!

Tuesday, August 4th, 2020, 03:01:08 AM IST

Ycp-mp-vijayasai-reddy-comm
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లో మూడు రాజధానుల పై అధికార, ప్రతి పక్ష పార్టీ నేతలు ఒకరి పై మరొకరు ఘాటు విమర్శలు చేస్తున్నారు. అయితే తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు 48 గంటల డెడ్ లైన్ పెడుతూ అధికార పార్టీ కి హెచ్చరికలు జారీ చేశారు. అయితే ఈ నేపధ్యంలో వైసీపీ కీలక నేత, ఎంపీ విజయ సాయి రెడ్డి స్పందించారు. చంద్రబాబు కి గట్టి కౌంటర్ ఇచ్చారు.

నేరగాడు పోలీసులకు, పేషంట్ డాక్టర్ కి డెడ్ లైన్ ఇస్తే ఎలా ఉంటుందో, ఘన విజయం సాధించిన ప్రజా ప్రభుత్వానికి చిత్తుగా ఓడిపోయిన నారా చంద్రబాబు నాయుడు డెడ్ లైన్ ఇస్తే అలాగే ఉంది అని దిమ్మ తిరిగే కౌంటర్ ఇచ్చారు. డెడ్ పార్టీ, డెడ్ లీడర్ షిప్ అరచే అరుపుల్ని డెడ్ లైన్ అంటారా నారావారూ అంటూ ప్రశ్నించారు. చంద్రబాబు ఇచ్చిన డెడ్ లైన్ పై వైసీపీ నేతలు అంతా దీటుగా బదులు ఇస్తున్నారు. అయితే ఎంపీ విజయ సాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలు మరోమారు చర్చాంసనీయం అయ్యాయి.

అయితే విజయ సాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలపై నెటిజన్లు స్పందిస్తున్నారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. అయితే పాజిటివ్ వచ్చిన ఎంపీ విజయ సాయి రెడ్డి తాజాగా కోలుకున్నారు. అయితే పక్క రాష్ట్రంలో ట్రీట్మెంట్ తీసుకోవడం పట్ల ఏపీ ప్రజలకు ఏలాంటి నమ్మకం ఉంది అనేది అర్దం అవుతుంది అంటూ విమర్శలు చేస్తున్నారు.