కులమత భేదాలు లేని సమాజానికి తొలి అడుగు

Friday, October 16th, 2020, 11:02:14 AM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో భారీ మెజారిటీ తో గెలిచిన అనంతరం నుండి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పలు విప్లవాత్మక మార్పులు తీసుకు వచ్చారు. సంచలన నిర్ణయాలతో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో పలు మార్పులకు శ్రీకారం చుట్టారు. అయితే సీఎం జగన్ మోహన్ రెడ్డి తీసుకున్న మరొక నిర్ణయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

కులమత భేదాలు లేని సమాజానికి తొలి అడుగు వేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దూర దృష్టి కి సలాం అంటూ వైసీపీ నేత, ఎంపీ విజయసాయి రెడ్డి కొనియాడారు. పాఠశాల హజరు రికార్డు ల్లో విద్యార్థుల కులం మరియు మతం ప్రస్తావించ కూడదు అని ఆదేశాలు జారీ చేసిన మొట్ట మొదటి రాష్ట్రం మన ఆంధ్ర ప్రదేశ్ అని గర్వంగా చెప్పుకొచ్చారు. ఎందరో మహాత్ములు కలలు కన్న కుల మతరహిత సమాజానికి ఇది నాంది అని విజయసాయి రెడ్డి వ్యాఖ్యానించారు.