కోర్టుల్లో 70 కి పైగా మొట్టికాయలు పడినప్పుడు తప్పులు దిద్దు కోవాల్సిన అవసరం ఉంది

Thursday, August 27th, 2020, 06:53:50 PM IST

Raghurama-Krishnam-Raju

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ వైఖరి పై మరొకసారి వైసీపీ నేత, ఎంపీ రఘురామ కృష్ణంరాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. కళ్లుండి మనసులేని ప్రభుత్వాలు చేస్తున్న అన్యాయాలను కళ్ళు లేని మనసున్న న్యాయ స్థానాలు న్యాయం చేస్తున్నాయి అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అమరావతి రాజధాని అంశం పై ప్రస్తావిస్తూ గాంధేయ మార్గంలో పోరాటం చేయాలని అమరావతి రైతులకు రఘురామ కృష్ణంరాజు సూచనలు చేశారు. అంతేకాక అమరావతి రైతుల పక్షాన అన్యాయానికి వ్యతిరేకంగా మహిళలు చక్కటి పోరాటం చేస్తున్నారు అంటూ వారి పై ప్రశంసలు కురిపించారు.

అయితే అన్యాయం పై అమరావతి రైతులు పాక్షికంగా విజయం సాధించారు అని రఘురామ కృష్ణంరాజు అన్నారు. అయితే స్టేటస్ కో ఆర్డర్ ఉన్నప్పుడు వైజాగ్ లో అతిథి గృహం నిర్మాణానికి పూనుకోవడం దుస్సాహసం అంటూ రాష్ట్ర ప్రభుత్వం పై ఘాటు విమర్శలు చేశారు. అయితే కోర్టుల్లో 70 కి పైగా మొట్టికాయలు పడినప్పుడు తప్పులు దిద్దు కోవాల్సిన అవసరం ఉంది అంటూ సెటైర్స్ వేశారు. అయితే పలువురు ముఖ్యమంత్రులు గా ఉన్నప్పుడు కోర్టులు చిన్న కామెంట్స్ చేస్తేనే రాజీనామా లు చేసిన సందర్భాలు ఉన్నాయి అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే రఘురామ కృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలకు వైసీపీ నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి.