మరోసారి హాట్ టాపిక్ అవుతున్న రఘురామ కృష్ణంరాజు.!

Tuesday, August 4th, 2020, 07:04:11 AM IST

MP-Raghurama-Krishnam-Raju

ఇప్పుడు ఏపీలో మూడు రాజధానుల రచ్చ ఏ స్థాయిలో కొనసాగుతుందో అందరికీ తెలిసిందే. ఏపీలో ఉన్నటువంటి మూడు కీలక పార్టీలు ఒక్కో రకమైన స్టాండ్ తో ఉన్నాయి. అయితే అధికార వైసీపీ పార్టీ మాత్రం గతంలో ఒకలా మాట్లాడి ఇప్పుడు ఒకలా మాట్లాడ్డం కాస్త ఎబ్బెట్టు కలిగించే అంశంగా మారింది.

గతంలో అమరావతిలోనే రాజధాని ఉంటుందని చెప్పిన చాలా మంది నేతలే ఇప్పుడు మాట మార్చి విశాఖనే అంటున్నారు. ఇక ఈ విషయం పక్కన పెడితే గత కొన్నాళ్ల నుంచి వైసీపీ లో ఓవర్ హాట్ టాపిక్ అవుతున్న నేత రఘురామ కృష్ణంరాజు ఇప్పుడు జగన్ పై మరోసారి సంచలన కామెంట్స్ చేసి హాట్ టాపిక్ అయ్యారు.

జగన్ ఇస్తానన్న పెన్షన్ లో పెంచిన 250 రూపాయలనే సరైన సమయానికి ఇవ్వలేకపోయారు. ఇంక మూడు రాజధానులు ఎలా కట్టిస్తారు అంటూ సంచలన కామెంట్స్ చేసారు. దీనితో రఘురామ కృష్ణంరాజు మరోసారి హాట్ టాపిక్ అయ్యారు.