దటీజ్ సీఎం జగన్ – వైసీపీ ఎంపీ

Friday, November 20th, 2020, 07:28:46 AM IST

Vijaya_sai

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో గత ఎన్నికల అనంతరం సీఎం జగన్ మోహన్ రెడ్డి పలు విప్లవాత్మక మార్పులకి శ్రీకారం చుట్టారు. ముఖ్యంగా ప్రభుత్వ పాటశాల ల విషయం లో సీఎం జగన్ మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం పేద ప్రజలకు వరంగా మారింది. అయితే ఈ మేరకు ఈ విషయాలను గుర్తు చేస్తూ వైసీపీ కీలక నేత, ఎంపీ విజయసాయి రెడ్డి పలు వ్యాఖ్యలు చేశారు.

పిల్లలు రావడం లేదు అని అప్పట్లో వందల స్కూళ్లను మూసివేయించారు బాబు అని పేర్కొన్నారు. మౌలిక వసతులు కల్పించకుండా గాలికి వదిలేసి కార్పొరేట్ విద్యా సంస్థల విస్తరణ కి చప్పట్లు కొట్టారు అని తెలిపారు. అయితే 2.5 లక్షల మంది విద్యార్థులు ప్రైవేట్ స్కూళ్ల నుండి ప్రభుత్వ బడుల్లో చేరారు అని, ఇలాంటిది ఎప్పుడైనా ఊహించారా అంటూ ప్రతి పక్ష నేతలకు ప్రశ్న వేశారు. దటీజ్ సీఎం జగన్ అంటూ ఎంపీ విజయసాయి రెడ్డి కొనియాడారు.

అయితే ఎంపీ విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలకు నెటిజన్లు స్పందిస్తున్నారు. కొందరు ఎంపీ చేసిన వ్యాఖ్యలను సమర్ధిస్తూ కామెంట్స్ చేస్తుండగా మరి కొందరు మాత్రం వైసీపీ తీరును తప్పుబడుతున్నారు.