సీఎం జగన్ నిరంతరం తాపత్రయ పడుతున్నారు

Friday, December 11th, 2020, 11:56:09 AM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి పై వైసీపీ కీలక నేత, ఎంపీ విజయసాయి రెడ్డి మరొకసారి ప్రశంసల వర్షం కురిపించారు. జగనన్న జీవ క్రాంతి పథకం కింద 2.50 లక్షల జీవాలు పంపిణీ చేయడం చరిత్రలో నిలిచిపోయే ఘట్టం అని విజయసాయి రెడ్డి కొనియాడారు. దీని కోసం వ్యయం చేసే 1,868 కోట్లు బలహీన వర్గాల మహిళల స్వయం సమృద్దికి తోడ్పడతాయి అని తెలిపారు. అయితే ప్రజల జీవన ప్రమాణాలు పెంచేందుకు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు నిరంతరం తాపత్రయ పడుతున్నారు అని అన్నారు.

అయితే ఏలూరు ఘటన విషయం లో ఆసుపత్రి కి వచ్చిన రోగులకు వైద్యులు మరియు సిబ్బంది దేవతల్లా స్పందించారు అని కొనియాడారు. కార్పొరేట్ ఆసుపత్రుల్లో కూడ క్షణాల్లో రోగులను తీసుకెళ్ళి చికిత్స అందించడం కనిపించదు అని, సీఎం జగన్ గారి స్ఫూర్తి ను అందిపుచ్చుకున్న వారందరికీ కూడా అభినందనలు అంటూ విజయసాయి రెడ్డి వ్యాఖ్యానించారు.