రఘురామ కృష్ణంరాజు ఒక నీచ సంస్కృతి కలిగిన వ్యక్తి – వైసీపీ ఎంపీ

Tuesday, September 22nd, 2020, 01:19:37 AM IST


ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో అధికార పార్టీ తరపున గెలిచి, రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న ప్రతి నిర్ణయం పై వరుస ప్రశ్నలు గుప్పిస్తున్న రఘురామ కృష్ణంరాజు పై వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే తాజాగా వైసీపీ నేత, ఎంపీ నందిగం సురేష్, రఘురామ కృష్ణంరాజు పై సంచలన వ్యాఖ్యలు చేశారు. రఘురామ కృష్ణంరాజు అహంకారం తో మాట్లాడుతున్నారు అని, దళితులు అంటే చిన్నచూపు అంటూ వ్యాఖ్యానించారు. అయితే సెక్యూరిటీ తో తనను కాల్చి చంపిస్తానని బెదిరించినట్లు ఆరోపణలు చేశారు.

అయితే దళితుల పై రఘురామ కృష్ణంరాజు అనుచిత వ్యాఖ్యలు చేశారు అని, ఆయన పై ఎస్పీ కమిషన్ మెంబర్ రాములు కి ఫిర్యాదు చేసిన విషయాన్ని మీడియా ద్వారా వెల్లడించారు. రఘురామ కృష్ణంరాజు నీచ సంస్కృతి కలిగిన వ్యక్తి అని అంటూనే, వైసీపీ తరపున గెలిచి ప్రతి పక్షానికి సహకరిస్తున్నారు అంటూ విమర్శలు చేశారు. దళితుల పై కామెంట్స్ చేశారు అని అంటూనే, దళితులు ఓట్లు వేస్తేనే ఎంపీ అయ్యారు అంటూ ఎద్దేవా చేశారు. అయితే ఆయన నియోజక వర్గం లో దళితులు ఎదురు తిరగ డానికి సిద్దంగా ఉన్నారు అని, ముక్కు నేలకు రాసి పార్లమెంట్ లో అడుగుపెట్టాలి అంటూ వ్యాఖ్యానించారు. రఘురామ కృష్ణంరాజు ను టార్గెట్ చేస్తూ చేసిన వ్యాఖ్యలకు ఎంపీ ఎలా స్పందిస్తారో చూడాలి.