అమరావతి లో అల్లర్లు సృష్టించేందుకు బాబు కుట్ర చేస్తున్నారు – వైసీపీ ఎంపీ

Monday, November 2nd, 2020, 07:24:08 AM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి కోసం ఇంకా ఉద్యమం జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే దీనిని కృత్రిమ ఉద్యమం అంటూ వైసీపీ నేతలు చెబుతూనే ఉన్నారు. అయితే యెల్లో మీడియా కూడా చంద్రబాబు చెప్పినట్లు గా వార్తలు రాస్తుంది అని వైసీపీ నేతలు మండిపడుతున్నారు. అయితే ఈ మేరకు మరొకసారి చంద్రబాబు నాయుడు తీరు పై వైసీపీ కీలక నేత, ఎంపీ నందిగం సురేష్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అమరావతి లో తన బినామీల కోసమే టీడీపీ కృత్రిమ ఉద్యమం అని, అందుకు మద్దతుగా చంద్రబాబు యెల్లో మీడియా చేత దిగజారుడు రాతలు రాయిస్తున్నారు అని అన్నారు.

జైలు ముట్టడి పేరుతో టీడీపీ నాయకుల ప్రయత్నాలను అడ్డుకుంటే, చంద్రబాబు వత్తాసు పలికే పత్రికలు, టీవీ చానెళ్లలో మాత్రం నిర్బంధ కాండ అని అభూత కల్పనలు వండి వార్చాయి అని ఎంపీ సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నాయుడు అమరావతి ప్రాంతంలో అల్లర్లు సృష్టించేందుకు కుట్రలు చేస్తున్నారు అని, అక్కడ ఏదైనా జరిగితే దానిని ప్రభుత్వం పై నెట్టాలనదే ఆయన లక్ష్యం అని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. బాబు సీఎం గా ఉన్నప్పుడు సింగపూర్ టెక్నాలజీ తో అమరావతి ను తీర్చి దిడ్డుతాం అని, రైతులు సెంట్ స్ప్రే చేసుకొని ఏసీ రూముల్లో పడుకోడమే తరువాయి అంటూ ఊదర గొట్టారు, అయితే అప్పుడు ఎల్లో మీడియా దానికి పెద్ద ఎత్తున ప్రచారం చేసింది అని, ఇప్పుడు కృత్రిమ ఉద్యమం కోసం జరగని దాన్ని జరిగినట్లు గా చిత్రీకరిస్తోంది అంటూ ఎంపీ సంచలన వ్యాఖ్యలు చేశారు.