అందుకే జనాలు నిన్ను కూర్చోపెట్టారు ఓడగొట్టి – వైసీపీ ఎంపీ

Thursday, October 22nd, 2020, 03:55:41 PM IST

2019 సార్వత్రిక ఎన్నికల్లో ఊహించని రీతిలో వైసీపీ భారీ విజయం సాధించింది. అయితే 151 స్థానాల్లో గెలుపొందిన వైసీపీ, అక్కడితో ఆగకుండా ప్రతి పక్ష పార్టీ ఎల్ సైతం కొందరు నేతలను ఆకర్షించింది. వైసీపీ ప్రభుత్వం ప్రవేశ పెడుతున్న పథకాల పై, ఆదరణ విషయం లో ఇతర పార్టీ లకు చెందిన నేతలు సైతం ఆకర్షితులు అవుతున్నారు. అయితే టీడీపీ మాత్రం ఇంకా ఓటమికి గల కారణాలు వెతుకుతూనే ఉంది. అయితే తాజాగా మరొక సారి వైసీపీ కీలక నేత, ఎంపీ విజయసాయి రెడ్డి తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పై ఘాటు విమర్శలు చేశారు.

అయితే బాబు అనుభవం అంతా, రాష్ట్రాన్ని అభివృద్ది చేయడం లో కాకుండా, గ్రాఫిక్స్ లో చూపెట్టి, రాష్ట్ర ప్రజలను మభ్య పెట్టీ, రాష్ట్ర ప్రయోజనాలు తొక్కి పెట్టీ, సొంత ప్రయోజనాలు ముందు పెట్టీ, రాష్ట్రానికి తెచ్చింది ఏంటయ్యా అంటే నీరూ, మట్టి అని, అందుకే నిన్ను జనాలు కూర్చో పెట్టారు ఓడగొట్టి అంటూ ఎంపీ విజయసాయి రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే వైసీపీ ఎంపీ చేసిన వ్యాఖ్యలకి నెటిజన్లు స్పందిస్తున్నారు. విజయసాయి రెడ్డి పై సైతం నెటిజన్లు ఘాటు విమర్శలు చేస్తున్నారు. మరి కొందరు మాత్రం ఎంపీ చేసిన వ్యాఖ్యలను సమర్ధిస్తున్నారు.