సీఎం జగన్ కి ఎంపీ రఘురామ కృష్ణంరాజు సరికొత్త డిమాండ్

Sunday, September 13th, 2020, 10:00:19 PM IST

Raghurama-Krishnam-Raju

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో జరుగుతున్న పలు పరిణామాల పై, అంశాల పై వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు ఢిల్లీ లో మీడియా సమావేశం లో మాట్లాడారు. అయితే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో హిందూ దేవాలయాల కి వెళ్ళే పేద భక్తుల్ని లూటీ చేయడం ఆపాలి అని సంచలన వ్యాఖ్యలు చేశారు.భగవంతుణ్ణి సామాన్యుడికి దూరం చేసే ప్రయత్నం జరుగుతోంది అని ఆరోపణలు చేశారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో సంచలనం సృష్టించిన అంతర్వేది రథం దగ్ధం ఘటన పై సీబీఐ దర్యాప్తు ను ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు.

అయితే తిరుమల తిరుపతి దేవస్థానం లో జరిగే బ్రహ్మోత్సవా ల్లో సీఎం జగన్ సతీ సమేతంగా ఎందుకు పాల్గొనడం లేదు అని రఘురామ కృష్ణంరాజు వ్యాఖ్యానించారు. హిందూ దేవాలయాలను పరిరక్షించడం తో పాటుగా అర్చకులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని సీఎం జగన్ ను డిమాండ్ చేశారు. అంతేకాక రాష్ట్ర ప్రభుత్వం నుండి 5 వేల రూపాయలు అందుకుంటున్న పాస్టర్ లలో చాలా ద్రువపత్రాలు హిందువులు గా ఉన్నాయి అని సంచలన వ్యాఖ్యలు చేశారు.దీని పై విచారణ జరిపించాలి అంటూ సీఎం జగన్ కి సరికొత్త డిమాండ్ వేశారు.చివరగా సీఎం జగన్ మోహన్ రెడ్డి రమ్మంటేనే వైసీపీ లోకి వచ్చినట్లు తెలిపారు.