జగన్ బెండయ్యే రకం కాదు… బెండు తీసే రకం

Monday, October 5th, 2020, 05:58:22 PM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో తెలుగు దేశం పార్టీ, అధికార పార్టీ పై చేస్తున్న వరుస విమర్శలకు, ఆరోపణలకు వైసీపీ నేత, ఎంపీ నందిగం సురేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ పెద్దల దగ్గర బెండ్ అవ్వడం చంద్రబాబు నాయుడు కి మరియు నారా లోకేష్ లకు అలవాటే అని ఎంపీ విమర్శించారు. అయితే వారి లాగానే అందరూ బెండ్ అవుతారు అని అనుకోవడం వాళ్ళ భ్రమ అని తెలిపారు. ఈ మేరకు నందిగం సురేష్ జ్ాన్ పై చేసిన ఆరోపణలకి గట్టి కౌంటర్ ఇచ్చారు.

సీఎం జగన్ మోహన్ రెడ్డి బెండయ్యే రకం కాదు అని, బెండు తీసే రకం అని అన్నారు. అయితే ఇటీవల ఢిల్లీ వెళ్లిన జగన్ పై అసత్య ప్రచారం చేయడం వల్ల అందుకు కౌంటర్ వ్యాఖ్యలు చేశారు. పసుపు రంగు బ్యాచ్ కి ఒక దరిద్రం పట్టింది అని, వాళ్లకు జరిగిన అవమానాలే ఎదుటివారికి కూడా జరిగాయి అని అనుకుంటున్నారు అని తెలిపారు. పట్టాభి మరియు సబ్బం హరి లను ఎవరు లెక్కలోకి వేసుకున్నారు, లెక్కలో వేసుకుంటే దాడి చేస్తారు అంటూ ఎద్దేవా చేశారు. అయితే వాళ్ళిద్దరినీ పట్టించుకునేవారు రాష్ట్రం లోనే లేరు అంటూ ఎంపీ సంచలన వ్యాఖ్యలు చేశారు.