బాబు పై ఉన్న 26 కేసుల్లో ఒక్క స్టే ఎత్తివేసినా జైలు కి వెళ్ళడం ఖాయం – వైసీపీ ఎంపీ

Wednesday, September 9th, 2020, 10:18:50 PM IST


తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పై వైసీపీ ఎంపీ నందిగం సురేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నాయుడు ది స్టే బతుకు అంటూ విమర్శలు చేశారు. చంద్రబాబు పై ఉన్న 26 కేసుల్లో ఒక్క కేసులో స్టే ఎత్తి వేసినా ఆయన జైలు కి వెళ్ళడం ఖాయం అని ఘాటు విమర్శలు చేశారు. అయితే టీడీపీ హయం లో అమరావతి రాజధాని పేరు తో, చంద్రబాబు నాయుడు, ఆయన అనుచరులు, నాయకులు వేలాది ఎకరాల భూమి దోచుకున్నారు అని ఆరోపణలు చేశారు.

అయితే నిన్నటి వరకూ కూడా ఎటువంటి విచారణకు అయినా సిద్దం అన్న చంద్రబాబు నాయుడు, ఇప్పుడు సిట్ విచారణ కి ఎందుకు అడ్డుకుంటున్నారు అని నిలదీశారు. అయితే వరుస అరెస్ట్ లతో చంద్రబాబు నాయుడు తో పాటుగా మిగతా తెలుగు దేశం పార్టీ కి చెందిన నాయకులకు వెన్నుల్లో వొణుకు పుడుతోంది అని అన్నారు. చంద్రబాబు కి దమ్ముంటే సిట్ విచారణ ఎదుర్కోవాలి అని ఎంపీ సవాల్ విసిరారు. అయితే బాబు తో పాటుగా మిగతా టీడీపీ కి చెందిన నాయకులు జైలు కి వెళ్ళడం ఖాయం అంటూ జోస్యం చెప్పారు.