దొంగే దొంగ అన్నట్లు టీడీపీ వ్యవహరిస్తోంది – వైసీపీ ఎంపీ

Tuesday, September 22nd, 2020, 05:00:44 PM IST

Ycp mp Chandrasekhar

తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు చేస్తున్న వరుస విమర్శలతో అధికార పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అనేక సంక్షేమ, అభివృద్ది కార్యక్రమాలను అమలు చేస్తూ ఉంటే, ప్రతి పక్ష పార్టీ లు ఓర్వలేక పోతున్నాయి అని వైసీపీ నేత, ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రభుత్వం చెస్తున్నటువంటి ప్రతి యొక్క పనిని కూడా స్టే లు తీసుకు వచ్చి అడ్డుకుంటున్నారు అని ఆరోపించారు.

అయితే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి లో గత ప్రభుత్వం అవినీతిని బయట పెట్టేందుకు ప్రయత్నం చేస్తే గ్యాగ్ ఆర్డర్ తో అడ్డుకున్నారు అని విమర్శలు చేశారు. అయితే హైకోర్టు తీర్పు పట్ల సుప్రీం కోర్టు ను ఆశ్రయించినట్లు వెల్లడించారు. అంతేకాక అమరావతి భూములు మరియు దేవాలయాల పై జరిగిన దాడుల విషయం లో సీబీఐ విచారణ జరిపించాలి అంటూ పార్లమెంట్ లో పోరాడుతున్నామని అన్నారు. దేవాలయాల పై జరిగిన దాడుల విషయం లో దొంగే దొంగ అన్నట్లు గా ప్రతి పక్ష పార్టీ టీడీపీ వ్యవహరిస్తోంది అని ఎంపీ ఘాటు విమర్శలు చేశారు. వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు రాజీనామా చేసి, మాట్లాడాలి అంటూ డిమాండ్ చేశారు. వైసీపీ ఎంపీ చేసిన వ్యాఖ్యలకి టీడీపీ నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి.