బిగ్ న్యూస్: కరోనా తో వైసీపీ ఎంపీ మృతి!

Wednesday, September 16th, 2020, 08:50:42 PM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో కరోనా వైరస్ మహమ్మారి తీవ్రత రోజురోజుకీ పెరుగుతోంది. అయితే కరోనా వైరస్ భారిన పడి మరణిస్తున్న వారి సంఖ్య రాష్ట్రం లో పదుల సంఖ్యలో ఉంది. అయితే తాజా గా ఈ మహమ్మారి భారిన పడి వైసీపీ ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ మృతి చెందారు. తిరుపతి నియోజక వర్గానికి చెందిన ఈయన ఇటీవల కరోనా వైరస్ భారిన పడి చెన్నై లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రి లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.

1985 లో రాజకీయ ప్రవేశం చేసిన బల్లి దుర్గ ప్రసాద్, 28 ఏళ్లకే ఎమ్మెల్యే గా గెలుపొందారు. నెల్లూరు ప్రాంతం నుండి నాలుగు సార్లు ఎమ్మెల్యే గా గెలుపొందిన ఈయన, 1994 లో చంద్రబాబు నాయుడు కేబినెట్ లో మంత్రిగా చేయడం జరిగింది. అయితే 2019 ఎన్నికల్లో వైసీపీ లో చేరిన ఈయన తిరుపతి నుండి ఎంపీ గా పోటీ చేసి గెలుపొందారు. ఇప్పటికే ఈయన మృతి పై పలువురు నాయకులు, ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.