బిగ్ న్యూస్: వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి కి కరోనా పాజిటివ్!

Sunday, August 30th, 2020, 04:00:32 PM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో కరోనా విజృంభణ తారా స్థాయికి చేరింది. ప్రతి ఒక్కరూ ఈ మహమ్మారి భారిన పడుతుండటం ప్రజలను భయ భ్రాంతులకి గురి చేస్తోంది. తాజాగా పార్లమెంట్ సభ్యుడు అవినాష్ రెడ్డి కరోనా వైరస్ భారిన పడ్డారు. తాజాగా కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు నిర్వహించగా అందులో కరోనా వైరస్ పాజిటివ్ అని తేలింది. సెప్టెంబర్ మొదటి వారం లో కడప జిల్లాలో సీఎం జగన్ పర్యటన ఉన్న సంగతి తెలిసిందే. అయితే సీఎం జగన్ పర్యటన కోసం ముందుగానే అధికారులు, నేతలు సిద్దం అవుతున్నారు.

అయితే ఈ నేపధ్యంలో ప్రజా ప్రతినిదులు, మీడియా కి చెందిన వారికి అధికారులు కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు చేస్తున్నారు. అయితే ఈ పరీక్షల లోనే అవినాష్ రెడ్డి కి కరోనా వైరస్ పాజిటివ్ అని తేలింది. ఈ విషయం తెలిసిన అనంతరం అవినాష్ రెడ్డి హోమ్ ఐసొలేషన్ కి వెళ్లి పోయారు. అయితే అవినాష్ రెడ్డి కి రావడం తో అతనిని ఒక వారం రోజుల నుండి కలిసిన వారి లో ఆందోళన మొదలైంది. అతనితో ఉన్న అనుచరులు సైతం కరోనా నిర్దారణ పరీక్షలు చేయించు కోవాలి అని అధికారులు సూచిస్తున్నారు. రోజుకి పది వేలకు పైగా కరోనా వైరస్ పాజిటివ్ కేసుల నమోదు తో రాష్ట్రం లో భయాందోళన నెలకొంది.