రాష్ట్ర సమస్యలు పరిష్కరించేందుకు సీఎం జగన్ ఢిల్లీ కి వచ్చారు – వైసీపీ ఎంపీ

Wednesday, September 23rd, 2020, 06:32:00 PM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాజాగా ఢిల్లీ పర్యటించారు. అయితే ఈ విషయం పై పలువురు అసత్య ప్రచారం చేస్తున్నారు అంటూ వైసీపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. అయితే ప్రతి పక్ష పార్టీ నేతలు చేస్తున్న ఆరోపణల పై వైసీపీ నేత, ఎంపీ మోపిదేవి వెంకటరమణ స్పందించారు. పలు ఘాటు విమర్శలు చేశారు.

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరియు కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా ల భేటీ పై అబద్ధాలు ప్రచారం చేస్తూ, ఆంధ్ర జ్యోతి వికృతంగా ప్రవర్తిస్తోంది అంటూ ఎంపీ సంచలన వ్యాఖ్యలు చేశారు. అసత్య కథనాలు ప్రచారం చేస్తూ రాక్షస ఆనందం పొందుతోంది అని, ఇందుకు ప్రజలు త్వరలోనే గుణపాఠం చెబుతారు అంటూ వ్యాఖ్యానించారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో ఉన్నటువంటి సమస్యలను పరష్కరించేందుకు సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రయత్నిస్తున్నారు అని ఎంపీ తెలిపారు.

అయితే సమస్యల పరిష్కారం కోసమే అమిత్ షా అపాయింట్మెంట్ కోరి ఢిల్లీ కి వచ్చారు అని ఎంపీ తెలిపారు. అమరావతి భూ కుంభకోణం, జడ్జి ల వ్యవహారం, ఫైబర్ నెట్ వర్క్ తదితర అంశాలను ప్రస్తావించారు అని అన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అన్ని పరిణామాలను వివరించినట్లు ఎంపీ తెలిపారు.