వైసీపీ విజయానికి కారణాలు అవే – వైసీపీ ఎంపీ

Monday, March 15th, 2021, 04:40:14 PM IST

తెలుగు దేశం పార్టీ బలంగా ఉన్న చోట్ల కూడా వైసీపీ జెండా ఎగురవేసింది. మునిసిపల్ ఎన్నికల్లో కూడా వైసీపీ తన సత్తా చాటింది. అయితే ఈ మేరకు వైసీపీ విజయానికి గల కారణాలను ఎంపీ మోపిదేవి వెంకటరమణ చెప్పుకొచ్చారు. రేపల్లె లో ప్రజలకు ఇచ్చిన హామీని సంవత్సరం లో పూర్తి చేస్తామని అన్నారు. రేపల్లె పట్టణాన్ని సుందరం గా తీర్చి దిద్దుతాం అని, వైసీపీ అభ్యర్ధులను గెలిపించిన వారందరికీ కూడా ధన్యవాదాలు తెలిపారు ఎంపీ వెంకటరమణ. అయితే రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అమలు చేస్తున్న సంక్షమ పథకాలు, రాష్ట్ర అబివృద్దికి తీసుకున్న నిర్ణయాలే వైసీపీ విజయానికి కారణాలు అంటూ చెప్పుకొచ్చారు. అంతేకాక గుంటూరు, విజయవాడ, విశాఖపట్నం ప్రజలు ఇచ్చిన తీర్పు ను చూస్తే సీఎం జగన్ పై ప్రజలకు ఎంత నమ్మకం ఉందో అర్థమవుతుంది అని వ్యాఖ్యానించారు. అయితే గుంటూరు లో చంద్రబాబు నాయుడు మాట్లాడిన మాటలకి ప్రజలే బుద్ది చెప్పారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే ఇచ్చిన మాటను నెరవేర్చే నైజం జగన్ ది అని, మాట నెరవేర్చకపోవడం చంద్రబాబు నైజం అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.