ప్రతి పక్ష నేత చంద్రబాబు విశ్వసనీయత కోల్పోయారు – వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్ధి

Friday, March 5th, 2021, 07:33:45 AM IST

YSRCP_party

తెలుగు దేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పై వైసీపీ నేతలు ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. ప్రతి పక్ష నేత చంద్రబాబు విశ్వసనీయత కోల్పోయారు అంటూ వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్ధి సీ. రామ చంద్రయ్య విమర్శించారు. చంద్రబాబు నాయుడు తన స్వార్థం కోసం మండలిని ఉపయోగించుకుంటున్నారు అని వ్యాఖ్యానించారు. అయితే చంద్రబాబు కి నేడు ఎన్నికల్లో అభ్యర్దులు దొరకని పరిస్థతి ఏర్పడింది అని అన్నారు.అయితే పంచాయతీ ఎన్నికల్లో 85 శాతానికి పైగా వైసీపీ మద్దతు దారులు గెలిచారు అని చెప్పుకొచ్చారు. మునిసిపాలిటి ల్లో కూడా వైసీపీ దే విజయం అని ధీమా వ్యక్తం చేశారు రామచంద్రయ్య. చంద్రబాబు ఇప్పుడు కూడా బాధ్యత గా వ్యవహరించకుంటే తెలుగు దేశం పార్టీ పరిస్థితి మరింత దారుణంగా తయారవుతుంది అని సంచలన వ్యాఖ్యలు చేశారు.

అయితే చంద్రబాబు నాయుడు పై చేసిన వ్యాఖ్యలు సర్వత్రా హాట్ టాపిక్ గా మారాయి. ఇప్పటికే పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ తమకు ఎక్కువ బలం ఉన్న ప్రాంతాల్లో సైతం ఓటమిని చవి చూసింది. అయితే మునిసిపల్ ఎన్నికల్లో కూడా ఆ పరిస్థితి రాకుండా ఉండేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నారు. టీడీపీ కి చెందిన కీలక నేతలు మున్సిపల్ ఎన్నికల్లో ప్రచారం చేస్తూ వైసీపీ పాలనా విధానం పై ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు.