చంద్రబాబు చేసే క్షుద్ర రాజకీయాలకు ఆయన బలిపశువు అవుతున్నారు

Tuesday, October 6th, 2020, 01:54:09 AM IST


ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో అధికార పార్టీ వైసీపీ ను టార్గెట్ చేస్తూ తెలుగు దేశం పార్టీ నేతలు చేస్తున్న విమర్శల పై, ఆరోపణల పై వైసీపీ నేతలు గట్టిగానే సమాధానం ఇస్తున్నారు. ఈ మేరకు సీపీఐ రామకృష్ణ తీరును కూడా ఎండగడుతూ వైసీపీ ఎమ్మెల్యే సుధాకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలుగు దేశం పార్టీ ఆద్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం లో సీపీఐ రామకృష్ణ చీఫ్ గెస్ట్ గా మాట్లాడినట్లు ఉంది అని ఎద్దేవా చేశారు. గతంలో వైసీపీ ఎన్నో ఉద్యమాలు చేపట్టినా రామకృష్ణ కలిసి రాలేదు అని, అమరావతి భూముల పోరాటం, దళితుల దాడుల పై ఆనాటి ప్రభుత్వంలో ఒక్క ముక్క కూడా వ్యతిరేఖంగా రామకృష్ణ మాట్లాడలేదు అని తెలిపారు.

అయితే భూ స్వాములకు రామకృష్ణ మద్దతుగా నిలుస్తున్నారు అని ఆరోపించారు.అయితే నేడు రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో మంచి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నా మాట్లాడలేదు అని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఇది కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా నా లేకపోతే చంద్రబాబు పార్టీ ఆఫ్ ఇండియా నా అంటూ ధ్వజమెత్తారు. చంద్రబాబు నాయుడు చేసే జుగుప్సాకర రాజకీయాలకు ఆయన సాక్షిగా నిలుస్తున్నారు అని, చంద్రబాబు అధికారం లో ఉండగా వత్తాసు పలికిన రామకృష్ణ, దళితులకు అన్యాయ జరిగిన నాడు నోరు ఎందుకు ఎత్తలేదు అని సంచలన వ్యాఖ్యలు చేశారు.

అయితే సీఎం జగన్ ను విమర్శించాడనికే ఈ రౌండ్ టేబుల్ సమావేశం అని, చంద్రబాబు నాయుడు చేసే క్షుద్ర రాజకీయాలకు ఈయన బలిపశువు గా మారుతున్నారు అంటూ ఎమ్మెల్యే సుధాకర్ బాబు సంచలన వ్యాఖ్యలు చేశారు.