ప్రజా సేవ చేయడానికే రాజకీయాల్లోకి వచ్చా

Friday, November 13th, 2020, 07:20:50 AM IST

వైసీపీ విషయంలో తెలుగు దేశం పార్టీ వ్యవహరిస్తున్న తీరు సరైనది కాదు అంటూ ఆ పార్టీ కి చెందిన నేతలు మొదటి నుండి చెప్తున్నారు. అయితే వైసీపీ కీలక నేత, ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి తెలుగు దేశం పార్టీ పై మరొకసారి విరుచుకుపడ్డారు. యెల్లో మీడియా తనపై అసత్య ప్రచారం చేస్తోంది అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే తనపై వచ్చిన ఆరోపణలపై యెల్లో మీడియా నిజానిజాలు తెలుసుకోకుండా ప్రచారం చేస్తోంది అంటూ మండిపడ్డారు.

అయితే దళిత డాక్టర్ అయిన తాను, ప్రజా సేవ చేయడానికే రాజకీయాల్లోకి వచ్చా అని ఎమ్మెల్యే శ్రీదేవి చెప్పుకొచ్చారు. అయితే ఎవరో అజ్ఞాత వ్యక్తి ఇచ్చిన టేపును డైలీ సీరియల్ లాగా ఎలా ప్రసారం చేశారు అంటూ సూటిగా ప్రశ్నించారు. అయితే గతంలో చంద్రబాబు నాయుడు ఓటుకి నోటు కేసులో పట్టుబడినప్పుడు ఎల్లో మీడియా ఎందుకు ప్రసారం చేయలేదు అంటూ ఎమ్మెల్యే సూటిగా ప్రశ్నించారు. ఏబీఎన్ రాధాకృష్ణ దళితులను అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నారు అని, టీఆర్పీ రేటింగ్ కోసం ఇంతగా దిగజారుతోంది అంటూ మండిపడ్డారు. మునిగిపోతున్న టీడీపీ ను బతికించాలని రాధాకృష్ణ చూస్తున్నారు అని ఆరోపించారు. కానీ అతని శ్రమ వ్యర్దం అవుతుంది అని, ఇకనైనా అసత్య ప్రచారాలు ఆపేయాలని ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు.