ఆ స్కాం లో సంతకం చేసి నారా లోకేష్ అడ్డంగా దొరికిపోయారు – ఎమ్మెల్యే రోజా

Monday, September 21st, 2020, 02:40:39 PM IST

MLA_Roja

తెలుగు దేశం పార్టీ పై వరుస విమర్శలు, ఆరోపణలు వస్తున్నాయి. అధికారం చేజారిన అనంతరం నుండి టీడీపీ కి ఒక దాని తర్వాత మరొకటి తలనొప్పిగా మారినట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటికే అమరావతి రాజధాని విషయం లో పలు ఆరోపణలు ఎదుర్కోవడం మాత్రమే కాకుండా, కొందరు టీడీపీ నేతలు పేర్లు కూడా గట్టిగానే వినిపిస్తున్నాయి. అయితే తాజాగా ఫైబర్ గ్రిడ్ లో నారా లోకేష్ పేరు తెరమీదికి వచ్చింది.

ఫైబర్ గ్రిడ్ కుంభకోణం లో తెలుగు దేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ అడ్డంగా దొరికిపోయారు అంటూ వైసీపీ ఎమ్మెల్యే రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే తండ్రి శాఖలో ఉన్న ఫైల్ పై నారా లోకేష్ ఎందుకు సంతకం పెట్టారు అంటూ సూటిగా ప్రశ్నించారు. అయితే ఈ ఫైబర్ గ్రిడ్ కుంభకోణం పై సీబీఐ విచారణ జరిపించాలి అని ఎమ్మెల్యే రోజా కోరారు.

అయితే అమరావతి లో చంద్రబాబు, నారా లోకేష్ లు భారీ కుంభకోణం చేశారు అంటూ రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజధాని లో లక్ష కోట్ల రూపాయల అవినీతి జరిగింది అని అన్నారు. తెలుగు దేశం పార్టీ కి చెందిన నేతలు, ఓ సామాజిక వర్గం కి చెందిన వాళ్ళే అక్కడ భూములు ఎందుకు కొనగలిగారు అంటూ మరొకసారి అనుమానం వ్యక్తం చేశారు. అయితే అమరావతి చంద్రబాబు కి ఏటీఎం అని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపిన విషయాన్ని గుర్తు చేస్తూ, సీబీఐ విచారణ జరిపించాలి అంటూ ప్రధాని నరేంద్ర మోడీ ను ఎమ్మెల్యే రోజా కోరారు.