టీడీపీ నేతలు ఇప్పుడు జైలు కి వెళ్ళక తప్పదు – ఎమ్మెల్యే రోజా

Wednesday, September 16th, 2020, 02:07:12 AM IST

Roja_MLA

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి విషయం లో అధికార , ప్రతి పక్ష పార్టీ నేతలు ఒకరి పై మరొకరు ఘాటు విమర్శలు చేస్తున్నారు. ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందంటూ వైసీపీ నేతలు చేస్తున్న ఆరోపణలు మరింత ఎక్కువగా అయ్యాయి. ఏసీబీ అధికారులు దీనిపై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టనున్నారు. అయితే ఈ వ్యవహారం పై నగరి నియోజకవర్గం ఎమ్మెల్యే రోజా స్పందించారు. టీడీపీ నేతల పై సంచలన వ్యాఖ్యలు చేశారు.

రాజధాని పేరుతో భూ కుంభకోణానికి పాల్పడ్డ తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆయన బినామీ లు జైలు కి వెళ్ళక తప్పదు అని అన్నారు. రాజధాని అమరావతి ప్రకటనకు ముందే చంద్రబాబు నాయుడుతో పాటుగా ఆయన బినామీలు వేల ఎకరాల భూమి కొనుగోలు చేశారు అని, అయితే చట్టాలను ఉల్లంఘించి భూములు కొన్న టీడీపీ నేతలు జైలు కి వెళ్ళక తప్పదు అని ఎమ్మెల్యే రోజా వ్యాఖ్యానించారు.

అయితే చంద్రబాబు నాయుడు తో పాటుగా తనయుడు నారా లోకేష్, బాలకృష్ణ, ప్రత్తిపాటి పుల్లారావు, పరిటాల సునీత లతో సహ చాలామంది టీడీపీ నేతలు భూములు కొనుగోలు చేశారు అని ఎమ్మెల్యే రోజా అన్నారు. ప్రతి కుంభకోణం లో స్టే లు తెచ్చుకోవడం చంద్రబాబు నాయుడు కి అలవాటు అయింది అని,ఇపుడు ఏసీబీ కేసులతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు అని, చంద్రబాబు నాయుడు ఇప్పుడు అయినా స్టే లు తెచ్చు కోకుండా తన నిజాయితీ ను నిరూపించుకోవాలి అని ఎమ్మెల్యే రోజా విమర్శలు చేశారు.