చంద్రబాబు, ఆయన బినామీ లు గజగజ వణుకుతున్నారు – రోజా

Sunday, September 20th, 2020, 03:00:24 AM IST

MLA_Roja
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి భూ కుంభకోణం విషయం లో వైసీపీ నేతలు చంద్రబాబు నాయుడు, ఆయన బినామీల పై వరుస విమర్శలు చేస్తున్నారు. తాజాగా వైసీపీ ఎమ్మెల్యే రోజా టీడీపీ నేతల తీరు పై ఘాటు విమర్శలు చేశారు. అమరావతి కుంభకోణం మీద ఏసీబీ కేసు నమోదు చేస్తే చంద్రబాబు నాయుడు, ఆయన బినామీ లు గజగజ వణుకుతున్నారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.అమరావతీ లో భారీ కుంభకోణం జరిగింది అని, బాబు, ఆయన బినామీలు వేల ఎకరాల భూమి కొనుగోలు చేశారు అంటూ రోజా అన్నారు.

టీడీపీ పాలన లో పెద్ద కుంభకోణం జరిగింది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ లాయర్ మీద కేసు నమోదు చేస్తే, హైకోర్టు గ్యాగ్ ఆర్డర్ ఇవ్వడం పట్ల రోజా ఆవేదన వ్యక్తం చేశారు.అయితే ప్రధాని నరేంద్ర మోడీ సైతం అమరావతి లో కుంభకోణం విషయం పై స్పందించారు అని, పోలవరం ను ఏటీఎం లా వాడుకున్నారు అంటూ రోజా వరుస విమర్శలు చేశారు. కానీ చంద్రబాబు నాయుడు మాత్రం తేలు కుట్టిన దొంగలా ఉన్నారు అని రోజా విమర్శించారు.