చంద్రబాబు లా పిరికిపంద రాజకీయాలు సీఎం జగన్ కి తెలియవు – రోజా

Monday, September 14th, 2020, 05:44:15 PM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో జరుగుతున్న పరిణామాల పై అధికార పార్టీ నేతలు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. అంతర్వేది ఘటన పై అధికార పార్టీ పై, ప్రతి పక్ష పార్టీ నేతలు వరుస విమర్శలు చేయడం జరిగింది. అయితే దీని పై సీబీఐ విచారణ జరిపించడం మాత్రమే కాకుండా, రథం నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేయడం జరిగింది. అయితే తాజాగా ఈ ఘటన పై వైసీపీ కి చెందిన నేత, ఎమ్మెల్యే రోజా పలు కీలక వ్యాఖ్యలు చేశారు.

అంతర్వేది ఘటన లో నిజాలు నిగ్గు తేలాలి అని ఎమ్మెల్యే రోజా డిమాండ్ చేశారు. అందుకోసమే సీబీఐ విచారణ కి సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆదేశించారు అని తెలిపారు.అయితే చంద్రబాబు నాయుడు లా పిరికి పంద రాజకీయాలు సీఎం జగన్ కి తెలియవు అని ఎమ్మెల్యే రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆనాడు రాష్ట్రానికి సీబీఐ అవసరం లేదు అని చంద్రబాబు నాయుడు అన్నారు, టీడీపీ పాలన లో 40 ఆలయాలను కూల్చి వేశారు అని, 29 మందిని పుష్కరాల్లో పొట్టన పెట్టుకున్నారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. బాబు హయాంలో దుర్గ గుడి, శ్రీకాళసహస్తి ఆలయాల్లో క్షుద్ర పూజలు జరిగాయి అంటూ ఆరోపించారు. చంద్రబాబు మత విద్వేషాలు రెచ్చగొట్టెందుకు కుట్ర పన్నారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.