దోపిడీకి అంచనాలు పెంచుకున్నారా?

Friday, December 11th, 2020, 04:20:31 PM IST

తెలుగు దేశం పార్టీ నేతల పై వైసీపీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. దేవినేని ఉమా, పరిటాల సునీత, శ్రీరామ్ లు మూడు రిజర్వాయర్ల శంకుస్థాపన కి రాజకీయ రంగు పులుముతున్నారు అంటూ విమర్శించారు. అయితే ఎన్నికల ముందు ఏడాది 2018 లో చంద్రబాబు నాయుడు పెన్నర్ ప్రాజెక్ట్ ను చేపట్టారు అని, ఎన్నికలకి ఒక నెల ముందు పనులను ప్రారంభించారు అని, పేరూరు డ్యాం కి పైసా ఖర్చు లేకుండా నీరు ఇవ్వొచ్చు అని చెప్పినా టీడీపీ వినిపించుకోలేదు అని అన్నారు. ఆనాడు అంచనాలు పెంచుకొని దోచుకునే ప్రయత్నం చేశారు అని సంచలన వ్యాఖ్యలు చేశారు.

అయితే వైసీపీ అధికారం లోకి వచ్చిన అనంతరం విచారణ చేయించి, 200 కోట్ల రూపాయల మిగులు కనిపించిన విషయాన్ని వెల్లడించారు. అయితే ఆ మిగులు నిధులతో మరొక రిజర్వాయర్ చేపట్టిన విషయాన్ని వెల్లడించారు. అయితే దేవినేని ఉమా చిత్తశుద్ది తో మాట్లాడాలి అని, అంచనాలు పెంచుకున్నప్పుడు మీరిక్కడికి వెళ్ళారు అంటూ సూటిగా ప్రశ్నించారు. దోపిడి కి అంచనాలు పెంచుకున్నారా అని నిలదీశారు. అయితే రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిధులు దుర్వినియోగం కాకుండా, కరువు ప్రాంతానికి నీరిస్తున్నారు అని అన్నారు.