బిగ్ న్యూస్ : టీడీపీ నేతలు దండుపాళ్యం బ్యాచ్…వైసీపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

Monday, August 31st, 2020, 04:30:25 PM IST

parthasarathi

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అయితే ఇప్పటికే ఆ ప్రయత్నం చాలా సార్లు ఆగింది. సీఎం జగన్ పాలన తీరు పై తెలుగు దేశం పార్టీ నేతలు విమర్శలు చేస్తూనే ఉన్నారు. వైసీపీ తీరు పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. అయితే టీడీపీ నేతల ధోరణి పై వైసీపీ కి చెందిన ఎమ్మెల్యే కొలుసు పార్థ సారథి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇళ్ళ స్థలాల పంపిణీ ను అడ్డుకొనేందుకు చంద్రబాబు కుట్రలు చేస్తున్నారు అని, టీడీపీ నేతలు దండుపాళ్యం బ్యాచ్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

అయితే టీడీపీ హాయం లో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగింది అని, ప్రైవేట్ కంపెనీ లకు భూములను ముడుపులకు ఇచ్చారు అని, సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే ఇపుడు యెల్లో మీడియా తో కలిసి బాబు దుష్ప్రచారం చేస్తున్నారు అని, పేదల ఇళ్ళ స్థలాలు అడ్డుకోవాలని ఆయన చేస్తున్నారు అని, అమరావతి లో పేద ప్రజలకు సెంట్ భూమిని కూడా కేటాయించలేదు అని అన్నారు. నివాస యోగ్యం కానీ భూముల్లో లక్షలు పెట్టీ దోచుకున్నారు అని తెలిపారు.