చంద్రబాబు బ్యాక్ డోర్ పొలిటీషియన్ – వైసీపీ ఎమ్మెల్యే

Sunday, October 4th, 2020, 05:20:14 PM IST

తెలుగు దేశం పార్టీ నేతలు చేస్తున్న విమర్శలకు, ఆరోపణలకు వైసీపీ కి చెందిన నేత, ఎమ్మెల్యే గుడివాడ అమర్ నాథ్ మరొకసారి ఘాటు విమర్శలు చేశారు. అక్రమాలకు చంద్రబాబు నాయుడు అన్నయ్య అని, సబ్బం హరి తమ్ముడు అంటూ ఎమ్మెల్యే ఆరోపించారు. అంతేకాక సబ్బం హరి పొలిటికల్ బ్రోకర్ అంటూ ఎమ్మెల్యే ఆరోపించారు. మూడు కోట్ల రూపాయల విలువైన భూమిని సబ్బం హరి కబ్జా చేశారు అంటూ సంచలన ఆరోపణలు చేశారు. అనేక సార్లు సబ్బం హరి కి నోటీసులు ఇచ్చినా స్పందించ లేదు అని, అక్రమంగా భూములు దోచేస్తే ఊరుకోవాలా అంటూ ఎమ్మెల్యే సూటిగా ప్రశ్నించారు.

అయితే వైజాగ్ లో ఒక సెంటు భూమి కూడా కబ్జా కానివ్వం అని, ప్రభుత్వం భూములను అక్రమ దారుల చేతిలోకి వెళ్లనివ్వం అని, చంద్రబాబు అధికారం లో ఉండగా విశాఖ లో భారీ భూ కుంభకోణం జరిగింది అని సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే 200 గజాలు కాదు, రెండు గజాలు కూడా కబ్జా కానివ్వం అని, చంద్రబాబు నాయుడు బ్యాక్ డోర్ పొలిటీషియన్ అని, సబ్బం హరి బ్లాక్ మెయిల్ పొలిటీషియన్ అంటూ ఎమ్మెల్యే ఆరోపించారు. అంతేకాక దోపిడీలు, అక్రమాల్లో సీనియారిటీ ను బట్టి టీడీపీ లో పదవులు ఇస్తారు అంటూ విమర్శలు గుప్పించారు.