అదృష్టం కొద్దీ ఎమ్మెల్యే అయింది నువ్వు… నేను కాదు!

Saturday, September 19th, 2020, 03:01:43 AM IST


ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో గత కొద్ది రోజులుగా అధికార పార్టీ వైసిపి మరియు ప్రతిపక్ష టీడీపీ నేతల మధ్యన మాటల తూటాలు పేలుతున్నాయి. అయితే తాజాగా ప్రత్తిపాడు ఎమ్మెల్యే పూర్ణ చంద్ర ప్రసాద్ తెలుగు దేశం పార్టీ కి చెందిన జ్యోతుల నెహ్రూ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. నెహ్రూ పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ తాజాగా ఘాటు విమర్శలు చేశారు. అదృష్టం కొద్దీ ఎమ్మెల్యే అయింది నువ్వు , నేను కాదు అంటూ ఎమ్మెల్యే పూర్ణ చంద్ర ప్రసాద్ వ్యాఖ్యానించారు.

అయితే ఆనాడు తోట సుబ్బారావు వెనుక మావయ్య మావయ్య అంటూ ఫైల్స్ మోసావూ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే ఆయనకు ఎంపీ సీటు రావడంతో వాళ్ళ వారిని కాదు అని, నీకు ఎమ్మెల్యే సీటు ఇప్పించారు, తోట సుబ్బారావు వల్లే నీకు అదృష్టం కలిగింది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే సీఎం జగన్ మోహన్ రెడ్డి మిమ్మల్ని నమ్మి సీటు ఇస్తే టీడీపీ కి అమ్ముడు పోయి పార్టీ ను మోసం చేశారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.