చంద్రబాబు రాజీనామా చేస్తాడని అనుకున్నాం – ఎమ్మెల్యే రోజా సంచలన వ్యాఖ్యలు!

Friday, August 7th, 2020, 01:58:24 AM IST

Roja_MLA
చంద్రబాబు 48 గంటల డెడ్ లైన్ పెట్టడం పై వైసీపీ ఎమ్మెల్యే రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. 48 గంటల డెడ్లైన్ తర్వాత చంద్రబాబు తోకముడిచి హైదరాబాద్ పారిపోయాడు అని అన్నారు.జగన్ కు ఉన్న దమ్ము ఏమిటో సోనియా గాంధీ ను అడగండి అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు రాజీనామా చేస్తాడని అనుకున్నాం, కానీ అందుకు భిన్నం గా జూమ్ లో జూమ్ డాన్స్ చేస్తున్నాడు అని ఘాటు విమర్శలు చేశారు. చంద్రబాబు వెంట ఆయన ఎమ్మెల్యే లేరు, ప్రజలు లేరు అని అన్నారు. అయితే మూడు రాజధానుల నిర్ణయానికి ప్రజలు అందరూ ఆమోదం తెలిపారు అని రోజా మరొకసారి అన్నారు.

అయితే మూడు ప్రాంతాల ప్రజలు సంతోషాన్ని వ్యక్తం చేశారు అని, జగన్ మోహన్ రెడ్డి నిర్ణయం ను న్యాయస్థానం కూడా ఆశీర్వదిస్తారు అని భావిస్తున్నాం అని ఆశాభావం వ్యక్తం చేశారు. అమరావతి రైతులు చంద్రబాబు ను నమ్ముకుంటే నట్టేటా ముంచేస్తాడు అని బాబు పై ఘాటు విమర్శలు చేశారు. అయితే లోకేష్ ను సీఎం చేయాలని చంద్రబాబు కి ఆలోచన ఎపుడు వచ్చిందో, అప్పటి నుండి ఆయన బుర్ర పని చేయడం లేదు అని అన్నారు. జగన్ లా లోకేష్ ఎన్నికలలో గెలవడం అనేది ఈ జన్మలో జరగని పని అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.