ప్రతి విషయాన్ని రాజకీయం చేయడం బాబు కు అలవాటే – వైసీపీ ఎమ్మెల్యే

Tuesday, December 1st, 2020, 03:00:18 AM IST

వరదల కారణంగా పంట నష్టపోయిన రైతులకు నష్ట పరిహారం చెల్లించాలి అంటూ టీడీపీ నేతలు నేడు నిరసన చేపట్టిన సంగతి తెలిసిందే. చంద్రబాబు నాయుడు వ్యవహరిస్తున్న ఈ తీరు పట్ల వైసీపీ నేతలు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైతులు, వ్యవసాయం గురించి మాట్లాడే నైతికత ప్రతి పక్ష నేత చంద్రబాబు నాయుడు కి లేదు అని వైసీపీ ఎమ్మెల్యే గుడివాడ అమర్ నాథ్ అన్నారు. టీడీపీ కి రైతుల సంక్షేమం పట్ల చిత్తశుద్ధి ఉంటే 23 సీట్లు ఎందుకు వస్తాయి అంటూ సెటైర్స్ వేశారు. బషీర్ బాగ్ లో రైతుల పై కాల్పులు జరిపిన చరిత్ర చంద్రబాబు నాయుడు ది అని ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు చేశారు.

వైఎస్సార్ ఉచిత విద్యుత్ అంటే కరెంట్ తీగల పై బట్టలు ఆరేసుకోవాలి అని విమర్శించిన చంద్రబాబు కి రైతుల గురించి మాట్లాడే హక్కు లేదు అని తెలిపారు. ప్రతి విషయాన్ని రాజకీయం చేయడం బాబు కు అలవాటు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అయితే తమది రైతుల సంక్షేమ ప్రభుత్వం అని, పార్టీలోని రైతు ఉందని గుర్తు చేశారు. అయితే నివర్ తుఫాన్ కారణంగా నష్టపోయిన రైతులను పరామర్షించని బాబు అసెంబ్లీ లో రైతుల గురించి ఏం మాట్లాడతారు అంటూ సూటిగా ప్రశ్నించారు. అంతేకాక గతంలో 86 వేల కోట్ల రూపాయల ను మాఫీ చేస్తానని హామీ ఇచ్చి ఎన్ని మాఫీ చేశారో చెప్పాలి అంటూ నిలదీశారు. రైతులకు వేల కోట్ల బకాయిలు పెట్టిన చంద్రబాబు రైతుల గురించి ఏ ముఖం పెట్టుకొని మాట్లాడతాడు అంటూ సూటిగా ప్రశ్నించారు.