చంద్రబాబు మొహం మీద ఉమ్ము వేయాల్సింది – వైసీపీ ఎమ్మెల్యే

Sunday, September 27th, 2020, 05:38:22 PM IST

తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి, ప్రతి పక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు పై వైసీపీ ఎమ్మెల్యే మేరుగ నాగార్జున సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నాయుడు నీతిమాలిన రాజకీయాలు చేస్తున్నారు అని, విభజించి పాలించడం ఆయన నైజం అంటూ విరుచుకుపడ్డారు. ప్రతి పక్ష నేతగా చంద్రబాబు నాయుడు వైఫల్యం చెందారు అని, కుట్రలు, కుతంత్రాలు ఆయనకి అలవాటే అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే విజయవాడ లో ఏర్పాటు చేసిన దళిత సమావేశం చంద్రబాబు రౌండ్ సమావేశం లో ఉంది అని ఘాటు విమర్శలు చేశారు.

అయితే అక్కడి రౌండ్ టేబుల్ సమావేశం కి కర్త,కర్మ క్రియ అన్ని చంద్రబాబు అంటూ విమర్శించారు. చంద్రబాబు నాయుడు చేతిలో ఉన్న కీలుబొమ్మలు ఈ సమావేశం పెట్టారు అని ఆరోపణలు చేశారు. విభజించు పాలించు అనేది చంద్రబాబు సూత్రం అని, దళిత ద్రోహి చంద్రబాబు అంటూ విమర్శించారు. జగన్ పాలనలో దళితులు సంతోషంగా ఉన్నారు అని, దళితుల్లో పుట్టాలని చంద్రబాబు అన్నపుడే, రౌండ్ టేబుల్ సమావేశం పెట్టిన వాళ్ళు చంద్రబాబు మొహం మీద ఉమ్ము వేయాల్సింది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే సమావేశం పెట్టించిన వాళ్ళు నిజంగా దళితులు అయి చంద్రబాబు తో క్షమాపణలు చెప్పించాలి అని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు.