ఫోన్ ట్యాప్ చేసే అవసరం మాకు లేదు…బాబు పై అంబటి రాంబాబు ఘాటు విమర్శలు

Tuesday, August 18th, 2020, 12:48:22 AM IST


ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో జరుగుతున్న పరిణామాల పై తెలుగు దేశం పార్టీ ఎప్పటికపుడు అధికార వైసీపీ పై ఘాటు విమర్శలు చేస్తూ, చర్యలను నిలదీస్తూ వస్తోంది. అయితే తాజాగా ఫోన్ ట్యాప్ వ్యవహారం రాష్ట్రం లో చర్చంశనేయం గా మారింది. ఈ వ్యవహారం పై చంద్రబాబు నాయుడు ప్రధాని నరేంద్ర మోడీ కి సైతం లేఖ రాయడం గమనార్హం. అయితే ఈ ఆరోపణల పై వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు ఘాటు విమర్శలు చేశారు.

ఫోన్ ట్యాప్ చేసే అవసరం మాకు లేదు అని అంబటి రాంబాబు తేల్చి చెప్పారు. అయితే మాములుగా సంఘ విద్రోహ శక్తులు, ఉగ్రవాద సంస్థల ఫోన్లు మాత్రమే ట్యాపింగ్ చేస్తారు అని అన్నారు.నారా చంద్రబాబు నాయుడు ఆధారాలు లేని ఆరోపణలు చేస్తున్నారు అంటూ ఏకిపారేశారు. చంద్రబాబు వి చౌకబారు రాజకీయాలు అని, ఎన్నికల సమయం లో మోడీ నీ విమర్శించి, ఎన్నికల అనంతరం మోడీ పై ప్రశంసలకు కురిపించిన తీరు పై నిప్పులు చెరిగారు.

అయితే చంద్రబాబు అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు పట్టుకొనే నైజం అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అధికారం పోయాక చంద్రబాబు కి వ్యవస్థల పై నమ్మకం కలిగిందా అంటూ సూటిగా ప్రశ్నించారు. అంతేకాక ఎల్జీ పాలిమర్స్ విషయం లో గగ్గోలు పెట్టిన టీడీపీ రమేష ఆసుపత్రి వ్యవహారం లో మౌనం గా ఉండటం పట్ల మండిపడ్డారు. చంద్రబాబు తన వారు అయితే ఒకలాగ, వేరే వాళ్ళు అయితే మరోలా వ్యవహరిస్తారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలు మరొకసారి హాట్ టాపిక్ గా మారాయి.