జేసీ బ్రదర్స్ పై తాడిపత్రి ఎమ్మెల్యే సెటైర్స్

Tuesday, October 27th, 2020, 03:00:50 PM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో పలు చోట్ల జరుగుతున్న సంఘటనలు అధికార పార్టీ, టీడీపీ కి మధ్య ఘర్షణ వాతావరణం ను క్రియేట్ చేసేలా ఉన్నాయి. అయితే తాడిపత్రి లోని వంగనూరు, బొందలదిన్నే గ్రామం లోని భూముల విషయం పై తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వంగనూరు మరియు బొందలదిన్నే గ్రామంలోని భూములను రైతులు స్వచ్చందంగా విక్రయించిన విషయాన్ని గుర్తు చేశారు. అయితే వాటిని ప్రస్తుతం మార్కెట్ ధరల ప్రకారం కొనుగోలు చేయవచ్చు అని ఎమ్మెల్యే మీడియా ద్వారా వెల్లడించారు. అయితే ఆ భూములను రైతులకు ఇప్పిస్తామని మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి చెప్పడం హాస్యాస్పదం అంటూ ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు. అయితే రాజకీయ లబ్ది కోసమే జేసీ ప్రభాకర్ రెడ్డి కక్షలు కార్పానలు రేకెత్తించేందుకు ప్రయత్నిస్తున్నారు అని ఎమ్మెల్యే ఆరోపించారు.

అయితే ఈ మేరకు జేసీ బ్రదర్స్ ను ఉద్దేశిస్తూ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు చేశారు. దొంగ లారీలు, దొంగ భూములు కొనుగోలు చేయడం కేవలం జేసీ సోదరులకు మాత్రమే చెందుతుంది అంటూ సంచలన ఆరోపణలు చేశారు. అయితే కర్ణాటక శాఖ అధికారులు స్పందించకుండా ఉంటేనే లోకాయుక్త కి ఫిర్యాదు చేయడం జరిగింది అని, నకిలీ పత్రాలతో రిజిస్ట్రేషన్ చేయించడం దివాకర్ ట్రావెల్స్ వారికే సాధ్యం అంటూ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే వైసీపీ నేతల పై టీడీపీ చేస్తున్న విమర్శలకు మరోమారు వైసీపీ ఎమ్మెల్యే గట్టి కౌంటర్ ఇచ్చినట్లు తెలుస్తోంది.