ప్రజాస్వామ్యంలో కులాల వారిగా న్యాయాలు ఉండవు – జోగి రమేష్

Friday, March 12th, 2021, 07:37:29 AM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో మునిసిపల్ ఎన్నికల వేళ కొల్లు రవీంద్ర పోలీసులతో జరిగిన వాగ్వాదం ఘటన లో అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. పోలీస్ పై చేయి చేసుకున్నాడు అంటూ వైసీపీ నేతలు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే తెలుగు దేశం పార్టీ నేతలు కొల్లు రవీంద్ర అరెస్టు ను ఖండిస్తూ అధికార పార్టీ వైసీపీ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ గట్టి కౌంటర్ ఇచ్చారు. కొల్లు రవీంద్ర బీసీ అయినంత మాత్రాన పోలీసులని కొట్టోచ్చా అంటూ సూటిగా ప్రశ్నించారు. బీసీ అయినంత మాత్రాన చట్టానికి అతీతులు కాదు అంటూ చెప్పుకొచ్చారు. ప్రజాస్వామ్యం లో కులాల వారిగా న్యాయాలు ఉండవు అని వ్యాఖ్యానించారు.

అయితే కొల్లు రవీంద్ర కి లోకేష్ తరహా లో పిచ్చి పట్టింది అంటూ విమర్శించారు. అందుకే పోలీసుల పై దాడి చేశారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే కొల్లు రవీంద్ర పై కేసు పెడితే అన్యాయం జరిగినట్లు మాట్లాడుతున్నారు అని వ్యాఖ్యానించారు. ఆయన బీసీ అయితే పోలీసులని తిట్టడం, కొట్టడం చేయవచ్చా అంటూ సూటిగా ప్రశ్నించారు. ఈ మేరకు తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పై సైతం ఘాటు వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నాయుడు ఏనాడైనా కొల్లు రవీంద్ర ను గౌరవించాడా, బీసీ లను ఏనాడైనా ఎదగనిచ్చాడా అని వరుస ప్రశ్నలు సంధించారు. కొల్లు రవీంద్ర పోలీసులను పిచ్చి పట్టినట్లు వ్యవహరించారు అని అన్నారు. పోలీసుల పై చేయి చేసుకోవడం నేరం కాదా అంటూ సూటిగా ప్రశ్నించారు. సీఎం జగన్ పాలన లో ఎవరు తప్పు చేసినా శిక్ష తప్పదు అని, బలహీన వర్గాలకు అండగా నిలిచింది సీఎం జగన్ మాత్రమే అని, చంద్రబాబు టీడీపీ నేతలను నట్టేట ముంచేస్తాడు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.