టీడీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తే చంద్రబాబు తప్ప ఎవరూ గెలవరు – ఎమ్మెల్యే జోగి రమేష్

Wednesday, August 5th, 2020, 09:55:11 PM IST


ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో రాజధాని విషయం పెను సంచలనం సృష్టిస్తోంది. ఇప్పటికే తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు వైసీపీ నేతలకు, సీఎం జగన్ మోహన్ రెడ్డి కి సవాల్ విసిరారు. అసేంబ్లి రద్దు చేయాలని చేసిన డిమాండ్ పై వైసీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు. అయితే తాజాగా ఈ వ్యవహారం పై వైసీపీ నేత, ఎమ్మెల్యే జోగి రమేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు హైదరాబాద్ లో దాక్కొని సవాల్ చేస్తున్నారు అని విమర్శలు చేశారు. ఆయన మాకు సవాల్ చేయడం ఏమిటి అంటూ రివర్స్ లో ప్రశ్నించారు. మేమే చంద్రబాబు కి సవాల్ చేస్తున్నాం అంటూ, మూడు రాజధానుల పై టీడీపీ ఎమ్మెల్యే లతో చంద్రబాబు రాజీనామాలు చేయించాలి అని అన్నారు.తమ ఎమ్మెల్యే లు ఓడిపోతారు అని చంద్రబాబు భయపడుతున్నారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే టీడీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తే చంద్రబాబు తప్ప ఎవరూ గెలవరూ అంటూ ఘాటు విమర్శలు చేశారు.

అయితే రాజధానిని తరలించడం లేదు అని, దానితో పాటుగా మరో రెండు ఏర్పాటు చేస్తున్నాం అని అన్నారు. అయితే అన్ని ప్రాంతాల అభివృద్ధి సీఎం జగన్ లక్ష్యం అని, గతంలో తెలంగాణ పై కేసీఆర్ ఎన్నికలకు వెళ్లారు అని, అమరావతి విషయం లో ఉప ఎన్నికలకు వెళ్లడానిక చంద్రబాబు ఎందుకు భయపడుతున్నారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. జోగి రమేష్ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ అయ్యాయి.