నీ రాజకీయ సినిమా అయిపోయింది పవన్… ఇక అసలు సినిమాలు చేసుకో!

Monday, June 29th, 2020, 07:32:21 AM IST

జన సేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కాపు రిజర్వేషన్ల అంశం పై చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే రేపాయి. వైసీపీ నేతలు ఒక్కొక్కరుగా పవన్ పై ఘాటు విమర్శలు చేస్తున్నారు. అయితే వైసీపీ నేత జక్కంపూడి రాజ పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకు ఘాటు గా జవాబిచ్చారు. నీ రాజకీయ సినిమా అయిపోయింది, ఇక అసలు సినిమాలు చేసుకో, ఆ సినిమాలను చూసి ఆనందిస్తాం అని వ్యాఖ్యానించారు.

చంద్రాబాబు పాలన లో తమ డిమాండ్ల కోసం రోడ్ల పైకి వచ్చినపుడు అక్రమంగా కేసులు పెట్టినపుడు ఎక్కడ ఉన్నావు అని పవన్ ను నిలదీశారు. అపుడు ఎందుకు ప్రశ్నించలేదు అని వ్యాఖ్యానించారు. అయితే చంద్రబాబు మనిషిగా, పార్టీ అధ్యక్షుడు గా రెండు పడవల పై కాలు వేసి ఇంకా ఎంత దూరం ప్రయాణిస్తారు అని గట్టి కౌంటర్ ఇచ్చారు. గడిచిన ఎన్నికల్లో కాపులు జన సేన పార్టీ కి గుణపాఠం చెప్పినా బుద్ది రాలేదు అని విమర్శించారు.

అయితే గత ప్రభుత్వం హాయం లో చంద్రబాబు కాపులను పట్టించుకోలేదు అని, పవన్ కళ్యాణ్ కూడా వారికి సాయం చేసే దిశలో మాట్లాడ లేదు అని ఆరోపించారు. చంద్రబాబు కాపులకు ద్రోహం చేశారు అని, అయిదేళ్ల పాలన లో వారి కోసం 1600 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు చేశారు అని వ్యాఖ్యానించారు. అయితే జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ వారికి న్యాయం చేస్తున్నారు అని వ్యాఖ్యానించారు.