టీడీపీ అవినీతి విశ్వవిద్యాలయాన్ని నడిపిస్తుంది – వైసీపీ ఎమ్మెల్యే

Monday, October 26th, 2020, 03:05:58 PM IST

గీతం భూములు విషయములో అధికార పార్టీ తీరు పై టీడీపీ నేతలు చేస్తున్న విమర్శలకు వైసీపీ ఎమ్మెల్యే గుడివాడ అమర్ నాథ్ గట్టి కౌంటర్ ఇచ్చారు. కోర్ట్ ఆర్డర్ ను టీడీపీ వక్రీకరించి ప్రచారం చేస్తోంది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.నారా లోకేష్ తోడల్లుడు, బాలకృష్ణ అల్లుడు భరత్ కి చెందిన గీతం విద్యా సంస్థల ప్రాంగణంలో ఆక్రమిత భూమిని స్వాధీనం చేసుకుంటే టీడీపీ రాజకీయం చేస్తోంది అని ఎమ్మెల్యే అమర్ నాథ్ ఘాటు విమర్శలు చేశారు.గీతం ఆధీనంలోని 40 ఎకరాల భూములను స్వాధీనం చేసుకోవడం ను ప్రజలు స్వాగతిస్తున్నారు అని ఎమ్మెల్యే తెలిపారు. గీతం యాజమాన్యం కోర్టు ఆర్డర్ ను కూడా వక్రీకరించ ప్రచారం చేస్తుంది అని ఎమ్మెల్యే అన్నారు.

గీతం యూనవర్సిటీ పై పలు సంచలన వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే, విద్యా దాహం కంటే భూ దాహం ఎక్కువగా కనిపిస్తుంది అని విమర్శించారు. అయితే పేదల కోసం ప్రభుత్వం ఉచితంగా స్థలాలు ఇస్తుంది కానీ, ఇలా భూ దాహం ఉన్న వ్యక్తులకు కాదు అని అన్నారు. అయితే వైసీపీ ఎమ్మెల్యే ల ఆద్వర్యంలో ప్రభుత్వ భూములు ఉన్నాయి అని విమర్శలు చేసే టీడీపీ నాయకుల ఋజువు చేయాలని డిమాండ్ చేశారు. అంతేకాక టీడీపీ అవినీతి విశ్వవిద్యాలయాన్ని నడిపిస్తుంది అని, చంద్రబాబు నాయుడు అవినీతి, అక్రమ రాజ్యాన్ని కాపాడుకోవడానికి తాపత్రయ పడుతున్నారు అని ఆరోపించారు.