వారిద్దరూ బ్లాక్ మెయిల్ చేస్తూ, బెదిరిస్తున్నారు – ఎమ్మెల్యే శ్రీదేవి

Saturday, November 7th, 2020, 09:00:24 AM IST

శృంగార పాటి సందీప్, చలివెంద్రపు సురేష్ త బెదిరిస్తున్నారు, బ్లాక్ మెయిల్ చేస్తున్నారు అంటూ వైసీపీ కి చెందిన నేత, తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి గుంటూరులోని నగరపాలెం పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే ఈ వ్యవహారం కాస్త వైసీపీ లో చర్చంశనేయం గా మారింది.

అయితే ఈ మొత్తం వ్యవహారం పై శ్రీదేవి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే సందీప్ మరియు సురేష్ లు ఇద్దరూ కూడా చట్ట వ్యతిరేకంగా మద్యం వ్యాపారం చేస్తూ, పేకాట ఆడిస్తూ పెదకాకాని పోలీసులకు పట్టుబడ్డారు అని ఫిర్యాదు లో ఎమ్మెల్యే వివరించారు. అయితే ఈ వ్యవహారం తో మండల పార్టీ నాయకులు వారిద్దరినీ కూడా పార్టీ నుండి బహిష్కరించారు అని తెలిపారు. అయితే ఈ విషయం తను అధిష్టానానికి చెప్పకపోయినా, తానే చెప్పినట్లుగా భావించి కొన్ని రోజుల పాటు పార్టీ కి వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు అని ఎమ్మెల్యే వివరించారు.

అయితే ఈ విషయం లో తన గొంతు మార్ఫింగ్ చేసి తనను అవమానిస్తున్నారు అని అన్నారు. అయితే తను బయటికి వెళ్ళినప్పుడు వెంటపడుతూ తనకు హని తలపెట్టే రీతిలో వారిద్దరూ వ్యవహరిస్తున్నారు అని ఫిర్యాదు లో పేర్కొన్నారు. వారి పై చర్యలు తీసుకోవాలని పోలీస్ శాఖ ను కోరారు. అయితే ఎమ్మెల్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీ ఐ మల్లికార్జున్ తెలిపారు. ఈ వ్యవహారం పై ప్రస్తుతం వైసీపీ నేతలు చర్చలు జరుపుతున్నారు.