ఓటర్లు రఘురామ కృష్ణంరాజు ను మర్చిపోయారు

Sunday, August 23rd, 2020, 03:00:48 AM IST


వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు పై వైసీపీ నేతలు ఘాటు విమర్శలు చేస్తున్నారు. తణుకు ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వర్ రావు ఎంపీ రఘురామ కృష్ణంరాజు పై సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్ నియోజక వర్గం ఓటర్లు రఘురామ కృష్ణం రాజు ను మర్చిపోయారు అని విమర్శించారు. కరోనా వైరస్ మొదలు నుండి ఇప్పటి వరకూ పర్యటించలేదు అని, వరదల సమయంలో కూడా ప్రజలను గాలికి వదిలేశారు అని సంచలన వ్యాఖ్యలు చేశారు.

సీఎం జగన్ ప్రజల కోసం నిరంతర కృషి చేస్తున్నారు అని, కరోనా వైరస్ మహమ్మారి నేపధ్యంలో ప్రజలు ఇళ్ళ వద్ద వినాయక చవితి పండుగ జరుపుకోవాలి అంటే దాన్ని రఘురామ కృష్ణంరాజు వక్రీకరిస్తున్నారు అని ఆరోపించారు. మతాల మధ్య చిచ్చు పెడుతున్నారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్ పార్టీలకు అతీతంగా, మతాలకు అతీతంగా పాలన చేస్తుంటే ఇలాంటి విమర్శలు తగవు అని హెచ్చరించారు.

టీడీపీ హయాంలో లో దేవాలయాలను కూల్చి వేసినపుడు బీజేపీ లో ఉన్న రఘురామ కృష్ణంరాజు ఎందుకు ప్రశ్నించలేదు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉన్మాది లా, ఉగ్రవాది లా వ్యాఖ్యలు చేస్తున్నారు అని, చంద్రబాబు నాయుడు ఇచ్చిన స్క్రిప్ట్ చదువుతున్నా వ్ అని ఆరోపించారు. చంద్రబాబు నాయుడు హయాంలో లో పుష్కరాల్లో ఎంతమంది మరణిస్తే ఎందుకు ప్రశ్నించలేదు అంటూ ఘాటు విమర్శలు చేశారు.