గిరిజన మహిళలతో కలిసి స్టెప్పులేసిన వైసీపీ ఎమ్మెల్యే

Sunday, August 9th, 2020, 05:37:42 PM IST

ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా పాలకొండ ఎమ్మెల్యే, అధికారులు సీతం పేట ఐటీడీఏ లో ఘనంగా వేడుకలను నిర్వహించడం జరిగింది. అయితే ఈ వేడుకలో పాల్గొన్న ఎమ్మెల్యే విశ్వరాయి కళావతి మరియు అక్కడ ఉన్నటువంటి అధికారులు గిరిజనులతో కలిసి స్టెప్పులేసారు. అయితే ఈ వేడుక సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు.

గిరిజనేతరుల కారణంగా వారి అవకాశాలకు గండి పడుతోంది అని, అంతేకాక దొంగ సర్టిఫికెట్ లతి గిరిజనేతరులు తమని దోచుకుంటున్నారు అని సంచలన వ్యాఖ్యలు చేశారు అయితే ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఒక విన్నపం చేశారు. గిరిజనులకు జరుగుతున్న అన్యాయానికి చెక్ పెట్టాల్సిన బాధ్యత ప్రభుత్వం పై ఉంది అని, తమది గిరిజన తెగ అని, వారి తెగ లో దయచేసి ఇతర కులాల్ని చేర్చవడ్డు అంటూ వేడుకొన్నారు. అయితే ఇప్పటికే ఈ సమస్యల ను సీఎం జగన్ మోహన్ రెడ్డి గారు దృష్టి కి తీసుకెళ్లిన విషయాన్ని గుర్తు చేశారు కరోనా వైరస్ మహమ్మారి ప్రభావం తగ్గిన తరువాత మనం కొరుకున్నట్లుగానే పాలన సాధించుకుందాం అను వ్యాఖ్యానించారు.