చంద్రబాబు, దేవినేని ఉమా, అచ్చెం నాయుడు నీచ రాజకీయాలకి కేరాఫ్ అడ్రస్ – మల్లాది విష్ణు

Thursday, February 11th, 2021, 02:32:55 PM IST

తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పై, టీడీపీ నేతల పై వైసీపీ కి చెందిన కీలక నేత, ఎమ్మెల్యే మల్లాది విష్ణు మరోమారు సంచలన వ్యాఖ్యలు చేశారు. తోలి దశ పంచాయతీ ఎన్నికల్లో ఇతర రాజకీయ పార్టీలను ప్రజలు చిత్తు చిత్తుగా ఓడించారు అని అన్నారు. అయితే తెలుగు దేశం పార్టీ నేతలు యెల్లో మీడియా ను అడ్డు పెట్టుకొని నీచ రాజకీయాలు చేశారు అంటూ విమర్శలు గుప్పించారు. అయితే వారికి ప్రజలు ఓటు ద్వారా బుద్ది చెప్పారు అంటూ చెప్పుకొచ్చారు.

అయితే చంద్రబాబు నాయుడు, రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వైసీపీ ప్రభుత్వం పై ఎన్ని విమర్శలు చేసినా ప్రజలు అంతా కూడా సీఎం జగన్ వైపు ఉన్నారు అంటూ వ్యాఖ్యానించారు. అయితే దేశానికే ఆదర్శంగా సీఎం జగన్ పాలన కొనసాగుతోంది అంటూ మల్లాది విష్ణు చెప్పారు. అయితే చంద్రబాబు నాయుడు, దేవినేని ఉమా, అచ్చం నాయుడు నీచ రాజకీయాలకి కేరాఫ్ అడ్రస్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ విజయ డంకా మోగిస్తోంది అంటూ తెలిపారు. అంతేకాక ప్రజలకు కావాల్సిన మౌలిక సదుపాయాలు అందిస్తున్నాం అని, ఇంకా ప్రజా కార్యక్రమాల తో పాటుగా, అభివృద్ధి కార్య్రమాలపై పలు వ్యాఖ్యలు చేశారు.