అమరావతి ను భ్రమరావతి గా చూపి భూములను దోచుకున్నారు – వైసీపీ ఎమ్మెల్యే

Sunday, August 9th, 2020, 09:28:00 PM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో అధికార పార్టీ పై తెలుగు దేశం పార్టీ నేత లు చేస్తున్న వరుస విమర్శలకు వైసీపీ నేత, ఎమ్మెల్యే ఉమా శంకర్ గణేశ్ ఘాటు విమర్శలు చేశారు. తెలుగు దేశం పార్టీ నేత అయ్యన్న పాత్రుడు ఉత్తరాంధ్ర ద్రోహి గా చరిత్రలో మిగిలిపోతారు అని సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే అమరావతి రాజధాని ను తరలిస్తున్నారు అంటూ టీడీపీ నేతలు చేస్తున్న ఆందోళన పై గట్టి కౌంటర్ ఇచ్చారు. అమరావతి ను భ్రమరావతి గా చూపి టీడీపీ నేతలు దోచుకున్నారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాక చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు 600 కి పైగా హామీలు ఇచ్చి, 60 కూడా నెరవేర్చని చేతకాని ప్రభుత్వం అంటూ దుయ్యబట్టారు. అయితే ఈ నేపధ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పై ప్రశంసల వర్షం కురిపించారు.

అధికారం చేపట్టిన కేవలం 14 నెలల్లోనే జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం దాదాపు 90 శాతం హామీలను నెరవేర్చింది అని ఎమ్మెల్యే ఉమా శంకర్ గణేశ్ అన్నారు. అయితే చంద్రబాబు నాయుడు, అయ్యన్న పాత్రుడు సోషల్ మీడియా వేదికగా రాష్ట్ర ప్రభుత్వం పై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు అని సంచలన వ్యాఖ్యలు చేశారు. వాస్తవాలను గ్రహించి ఇకనైనా ప్రవర్తించాలి అంటూ సెటైర్ వేశారు.