తప్పుడు కేసులు అంటూ పిచ్చిపట్టిన వాడిలా మాట్లాడుతున్నారు

Wednesday, November 18th, 2020, 07:23:11 AM IST

తెలుగు దేశం పార్టీ కీలక నేత, మాజీ మంత్రి దేవినేని ఉమా పై వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జక్కంపూడి లో ప్రజలు ప్రశ్నించినా ఆయనకు బుద్ది రాలేదు అని ఘాటు విమర్శలు చేశారు. తప్పుడు కేసులు అంటూ పిచ్చి పట్టిన వాడిలా మాట్లాడుతున్నారు అని, ఎన్నికల ముందు తన పై, తన తండ్రి పై, తన ప్రచార రథం డ్రైవర్ తో పాటు అనేక మందిపై తప్పుడు కేసులు పెట్టించింది, సస్పెక్ట్ షీట్లు పెట్టించింది నువ్వు కాదా అంటూ దేవినేని ఉమా పై ఆగ్రహం వ్యక్తం చేశారు.

అయితే పచ్చ చొక్కా సూరిబాబు ను అడ్డం పెట్టుకొని నీవు చేసిన అరచకాలు మైలవరం నియోజక వర్గం ప్రజలు అంతా కూడా చూశారు అని ఎమ్మెల్యే విమర్శించారు.తాము ఇప్పుడు అధికారం లో ఉన్నా కానీ, ఎక్కడైనా ఒక్క తప్పుడు కేసు పెట్టించిన దాఖలాలు లేవు అని అన్నారు. అయితే పోలవరం కాలువ మట్టి, గ్రావెల్, నీరు చెట్టు, ఇసుక ఇలా అన్నిట్లో దోపిడీ కి పాల్పడ్డావు అని దేవినేని ఉమా పై సంచలన ఆరోపణలు చేశారు. అంతేకాక ప్రస్తుతం 15 నెలల తన పాలన పై ప్రతి రోజూ పనికి మాలిన పోస్టులు, పిచ్చి పట్టిన వాడిలా ప్రేలాపనలు చేస్తున్నావు అని విరుచుకుపడ్డారు. జక్కంపూడి లో ప్రజలు సరైన సమాధానం చెప్పినా బుద్ది రాలేదు అని అన్నారు. అయితే 2024 లో ఎన్నికలే తనకు గీటు రాయి అని, అభివృద్ది చేసి చూపించి ప్రజల్లోకి వెళ్తా అని ఎమ్మెల్యే తెలిపారు.