ప్రజలను రెచ్చగొట్టడం లో టీడీపీ, బీజేపీ లు సిద్ధహస్తులు

Friday, January 8th, 2021, 07:48:16 AM IST

తెలుగు దేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పై వైసీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ మరియు వైసీపీ ల తీరు పై మండిపడుతూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారు అని అన్నారు. చంద్రబాబు హిందూ మత ద్రోహి గా తయారవుతున్నారు అని ఫైర్ అయ్యారు. అధికారం ఉంటే కులంతో, పోతే మతంతో చంద్రబాబు కుట్రలు పన్నుతున్నారు అని విమర్శించారు. అయితే చంద్రబాబు హయాంలో ఎన్నో ఆలయాలను కూల్చివేశారు అని మల్లాది విష్ణు తెలిపారు.

ఈ మేరకు చంద్రబాబు నాయుడు పై వరుస ప్రశ్నలు వేశారు. తిరుమలలో వెయ్యి కాళ్ళ మండపాన్ని కూల్చింది మీరు కాదా? ఇంద్రకీలాద్రి పై క్షుద్ర పూజలు చేసింది మీరు కాదా? అమరావతి డిజైన్ లో అమరేశ్వరుని బదులు బుద్దున్ని ఎందుకు పెట్టారు? తుంగభద్ర పుష్కరాలు జరిగితే చంద్రబాబు ఎందుకు వెళ్ళలేదు? అప్పుడు హిందూ మత గుర్తు లేదా అంటూ వరుస ప్రశ్నలతో నిలదీశారు. అయితే టీడీపీ తో కలిసి బీజేపీ ఆనాడే దేవాలయాలను కూల్చి విగ్రహాలను చెత్త ట్రాక్టర్ లో తీసుకెళ్ళింది అంటూ మండిపడ్డారు. బండి సంజయ్ అనే నాయకుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుంటే మంచిది అని,బైబిల్, ఖురాన్, భగవద్గీత కలిస్తేనే వైసీపీ అని, ఆయన అది గుర్తించాలి అని అన్నారు. అంతేకాక ప్రజలను రెచ్చగొట్టడం లో టీడీపీ, బీజేపీ లు సిద్ధహస్తులు అంటూ ఎమ్మెల్య మల్లాది విష్ణు సంచలన వ్యాఖ్యలు చేశారు.